పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమా పై ఊహకందని అంచనాలున్నాయి. అసలు ఇప్పటి వరకు సలార్ నుంచి కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి.. కనీసం టీజర్ కూడా రాలేదు. కానీ ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండడం ఖాయమంని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ అభిమానులు. అందుకు తగ్గట్టే మరింత టెంప్ట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీని నిర్మిస్తున్నహోంబళే సంస్థ అధినేత విజయ్ కిరగందుర్.. సలార్ పై మరింత హైప్ పెంచేసే కామెంట్స్ చేశాడు. ఇప్పటి వరకు సలార్ 80 శాతం షూటింగ్ పూర్తయిందని, బ్యాలెన్స్ షూటింగ్ జనవరిలో కంప్లీట్ చేస్తామని తెలిపాడు. ఆ తర్వాత ఆరునెలలు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులకే కేటాయిస్తామని.. ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 28కి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామన్నారు. ఇది పక్కా యాక్షన్ మూవీ అని.. తమ బ్యానర్ నుంచి వచ్చిన అన్ని సినిమాల రికార్డులు బద్దలు కొడుతుందని అన్నాడు. అలాగే సీక్వెల్ కూడా ఉంటుందని వెల్లడించారు. సీక్వెల్ విషయంలో తాము ఓపెన్‌గానే ఉన్నామని తెలిపారు. అంతేకాదు ‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలకు ఫ్రాంఛైజ్ ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. అయితే సలార్ సీక్వెల్ అప్డేట్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. దాంతో సలార్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. మొత్తంగా సాహో, రాధే శ్యామ్ సినిమాలతో డీలా పడిపోయిన ప్రభాస్.. సలార్‌తో నెక్స్ట్ లెవల్ అనేలా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు. మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.