Director Harish Shankar Mistakenly Reply To a Tweet
Harish Shankar:డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) పొరబడ్డారు. అవును ఈ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతా విస్ చేస్తున్నారు. రవితేజ పేరుతో ఒకరు ట్వీట్ చేయగా.. పొరబడి అన్నయ్య అంటూ రాసుకొచ్చారు. అయితే ట్వీట్ చేసింది మాత్రం.. అమెరికాలో ఉండే రవితేజ అని తెలిసింది.
రవితేజ పేరుతో బ్లూ టిక్ ఉన్న అకౌంట్ నుంచి హరీశ్ శంకర్‌కు (Harish Shankar) మెసేజ్ వచ్చింది. గబ్బర్ సింగ్‌ను మించిపోయే హిట్ కోసం హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడని.. గుడ్ లక్ అని ట్వీట్ వచ్చింది. ట్వీట్ చేసింది మాస్ మహారాజా రవితేజ అనుకుని హరీశ్ శంకర్ పొరబడ్డారు.
“అన్నయ్యా… ఈ ఇదీ నువ్వు నాటిన మొక్క… ఎన్ని సార్లయినా చెబుతా ఇదే ముక్క” అంటూ ఎమోషనల్ అయ్యారు. “మాస్ మహారాజా రవితేజకు మరొక్కసారి కృతజ్ఞతలు” అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. హరీశ్ శంకర్ పొరబడిన విషయాన్ని నెటిజన్లు గుర్తించారు. అది రవితేజ ఒరిజినల్ ఐడీ కాదని కామెంట్స్ సెక్షన్లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్ ఇస్తే ఇలాగే ఉంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
హరీశ్ శంకర్ కెరీర్ ఆరంభించింది రవితేజ సినిమాతో అనే సంగతి తెలిసిందే. షాక్ అనే మూవీ రవితేజ కెరీర్లో ఓ డిజాస్టర్ గా మిగిలింది. దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన రవితేజ అని కృతజ్ఞతాభావంతో హరీశ్ శంకర్ ఈ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అకౌంట్‌కు ఫాలోవర్లు కేవలం 300 మందే ఉన్నారు. అదేం చూడకుండా రిప్లై ఇచ్చారు.