»Did Samantha Go Into Depression Again Viral Tweet
Samantha: మళ్లీ సమంత డిప్రెషన్లోకి వెళ్లిందా? వైరల్ ట్వీట్!
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. కొన్నాళ్లు సమంత డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సామ్(Samantha) కొన్ని మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉంది. ఇక ఈ మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సమంత డిప్రెషన్లోకి వెళ్లిందంటూ.. ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసన ట్వీట్ వైరల్‌గా మారింది.
యశోద సినిమా రిలీజ్ సమయంలో మయోసైటిస్ గురించి చెప్పి.. ఫ్యాన్స్‌ను చాలా ఎమోషనల్ చేసింది సమంత(Samantha). అయితే ఆ సింపథి యశోద సినిమాకు బాగానే కలిసొచ్చింది. సమంత ఏడుపులే యశోదను నిలబెట్టిందనే కామెంట్స్ వినిపించాయి. అయితే సినిమా హిట్ అయింది. ఆ వెంటనే అమ్మడు కోలుకుంది. ఇక ఇప్పుడు శాకుంతలం విషయంలోను సమంత ఇదే ఫార్ములా అప్లై చేసిందనే టాక్ నడుస్తోంది. కానీ ఈ బోల్డ్ బ్యూటీకి సీన్ రివర్స్ అయిపోయింది. గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన శాకుంతలం.. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా అయిదు కోట్ల గ్రాస్ కూడా దాటలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో శాకుంతలం డిజాస్టర్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సమంత కెరీర్లో నిలిచిపోయింది. రెండో రోజు కూడా ఈ సినిమా పరిస్థితి దారుణం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సమంత పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో సమంత తన పర్సనల్ లైఫ్ గురించీ, హెల్త్ ప్రాబ్లమ్ గురించి పదే పదే ప్రస్తావించింది. ఇది సింపథి కోసమే చేసిందని…ఇకపై సమంత ఇలాంటి చీప్ ట్రిక్స్ మానేస్తే మంచిదని అంటున్నారు.
ఇక బాలీవుడ్లో సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు(umar sandhu).. శాకుంతలం సినిమా విడుదలైన రోజే సమంతను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. ఇక నిన్నఏకంగా.. ‘శాకుంతలం’ సినిమా రిజల్ట్‌తో సమంత డిప్రెషన్లోకి వెళ్లిపోయిందంటూ.. ట్వీట్ చేశాడు. అంతేకాదు ఆమె ఫోన్ కూడా స్విఛ్ ఆఫ్ చేసేసిందని పేర్కొన్నాడు. మొత్తంగా సమంత క్రేజ్ పడిపోయిందని రాసుకొచ్చాడు ఉమైర్. ప్రస్తుతం ఉమైర్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఏదేమైనా.. సమంత పై ఊహించని కామెంట్స్ వస్తున్నాయనే చెప్పాలి.