యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మీడియం రేంజ్ సినిమాలు చేసిన విశ్వక్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. చివరగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ‘ఓరి దేవుడా’ సినిమాతో అలరించిన విశ్వక్.. ప్రస్తుతం తానే స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ధమ్కీ. ఫిబ్రవరి 17న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, సాంగ్స్ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. దాంతో ధమ్కీతో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు విశ్వక్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే సీక్వెల్ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయిందట. త్వరలోనే ఈ సీక్వెల్ సంబంధించిన అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానునట్టు సమాచారం. దాంతో ధమ్కీ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ముందు ఫస్ట్ పార్ట్ రిలీజ్ హిట్ అయితే గానీ.. సీక్వెల్ ప్రకటించే ఛాన్స్ లేదు. పైగా ఇటీవల వచ్చిన మస్ మహారాజా ‘ధమాకా’ కథకు దగ్గరగా ‘ధమ్కీ’ స్టోరీ ఉంటుందనే టాక్ నడుస్తోంది. కాబట్టి ధమ్కీ మూవీకి సీక్వెల్ ఉంటుందో లేదో.. ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. ఇకపోతే.. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై.. విశ్వక్ కెరీర్లోనే గ్రాండ్గా రూపొందుతోంది.