రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. ఇప్పుడు వర్మ అంటేనే.. ఏంటీ మా కర్మ అనేలా విసుగెత్తిపోతున్నారు జనాలు. ఏంటి.. నేను మోనార్క్‌ని కాబట్టి తగ్గేదేలే అంటుంటాడు వర్మ. అయినా కూడా వర్మను పట్టించుకునే వారు పెద్దగా లేరు. అందుకే మరోసారి ఏపీ రాజకీయాలపై పడ్డాడు.
Comments on YS Jagan, Bharti's 'VYUHAM'.. Ram Gopal Varma Fire!
VYUHAM: వైఎస్ఆర్ పార్టీ, ఏపి సీఎం జగన్‌కు సపోర్ట్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ.. టీడీపీ టార్గెట్‌గా ఇప్పటికే రెండు, మూడు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు ‘వ్యూహం’ (VYUHAM) అనే రాజకీయ సినిమా చేయబోతున్నాడు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన ‘వ్యూహం’ (VYUHAM) కథ , రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే ‘వ్యూహం’.. (VYUHAM) ఈ చిత్ర నిర్మాత నాతో అంతకుముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్.. గతంలోనే ప్రకటించాడు వర్మ. అంతేకాదు ఈ చిత్రం 2 పార్ట్స్‌గా రాబోతుందని.. ఫస్ట్ పార్ట్ ‘వ్యూహం’ రెండో పార్ట్ ‘శపథం’ అని.. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయని.. రాష్ట్ర ప్రజలు ‘వ్యూహం’ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ పార్ట్ 2 ‘శపథం’తో తగులుతుందని అన్నాడు.
ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు.. అందుకే ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని.. మీకు వేరే చెప్పక్కర్లేదు.. కనక చెప్పట్లేదని ఫైనల్ టచ్ ఇచ్చాడు. దీంతో వర్మ వ్యూహం (VYUHAM) టార్గెట్ ఎవరికోసం అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వ్యూహం సినిమాపై వర్మ రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలపై రకరకాల కామెంట్లు, సెటైర్లు వస్తున్నాయి. వాటిపై రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నాడు. వాళ్ల పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా వైఎస్ జగన్, వైఎస్ భారతీ బెడ్ రూమ్ సీన్ ఫోటో పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. వాళ్లకు రిప్లే ఇస్తూ.. వ్యూహం అలాంటి సినిమా కాదు అంటూ వర్మ ట్వీట్ చేశాడు. అలాగే కొందరు డంబ్ ఇడియట్స్ వ్యూహం సినిమా గురించి ఏదో అనుకొంటున్నారు. వైఎస్ భారతీ పాత్ర గురించి ఏదో ఊహించుకొంటున్నారు కొందరు వెధవలు.. అంటు మండిపడ్డాడు. మొత్తంగా వర్మ వ్యూహం రచ్చ లేపేలా ఉంది.