Chiranjeevi: చిరంజీవి సినిమాలో శర్వానంద్.. రీమేక్ కాదట..!
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. అతని తదుపరి చిత్రం #Mega156 ఆల్రెడీ ఒకే అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
చిరంజీవి మూవీ విడుదలకు ముందే చాలా రూమర్స్ వస్తున్నాయి. DJ Tillu ఫేమ్ సిద్ధు ఈ చిత్రంలో చిరంజీవికి కొడుకుగా నటిస్తాడని చాలా ఊహాగానాలు వచ్చాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మోహన్ లాల్ , పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మలయాళ చిత్రం బ్రో డాడీకి అధికారిక రీమేక్ అని కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. ఇప్పుడు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం మెగా 156 ఏ రీమేక్ కాదని, స్ట్రెయిట్ తెలుగు సినిమా అని తెలిసింది. ఈ సినిమాలో శర్వానంద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవికి కొడుకుగా కనిపిస్తాడా లేక తమ్ముడిగా కనిపిస్తాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ ప్రాజెక్ట్‌ని తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కింద నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 22న అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారనే దానిపై పూర్తి స్పష్టత, వివరాలు అందుతాయి.