ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమాను ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫారిన్ వెకేషన్లో ఉన్నాడు.. తిరిగి రాగానే సంక్రాంతికి ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయబోతున్నారట. దాంతో కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సైఫ్ అలిఖాన్‌ను విలన్‌గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో సంజయ్ దత్ పేరు వినిపించగా.. ఇప్పుడు సైఫ్ అయితే బాగుంటుదని భావిస్తున్నారట. ఎన్టీఆర్ 30లో విలన్ రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. అందుకే సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్‌తో చేయించాలని చూస్తున్నారట. ఒకవేళ సైఫ్ అందుకు ఒప్పుకుంటే.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు మరింత హైప్ వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు ఈ బాలీవుడ్ హీరో. అలాగే.. గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ ఎస్ఎస్ఎంబీ 28లోను సైఫ్ పేరు వినిపించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోను సైఫ్ అలీఖాన్ పేరు తెరపైకి రావడం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే నిజంగానే సైఫ్‌ను ఎన్టీఆర్‌కు విలన్‌గా తీసుకుంటారా.. లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే హీరోయిన్ను మాత్రం ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. శ్రీదేవి తనయ, బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయిపోయిందని టాక్. దీంతో ఎన్టీఆర్ 30లో బాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ ఎక్కువేనని చెప్పొచ్చు.