Tulasi Chandu: ఈనాడు జర్నలిజమ్ పాఠశాల నుంచి జర్నలిస్టుగా బయటకు వచ్చి సమాజం మీద ప్రేమతో, ఇష్టంతో పనిచేసినట్లు చెప్పారు. అందరిలా ఏదోటి చెప్పడం కన్నా నిజాలను మాత్రమే ప్రజలకు చెప్పడం అనే దారిని ఎంచుకున్నాను అని వెల్లడించారు. నిజాలు మాట్లాడితే దేశద్రోహం కేసులలు పెడుతున్నారు, ఇప్పటి వరకు చాలా మంది తనను బెదిరించారని పేర్కొన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చేయడం కష్టమైన పని అయినప్పటికీ చాలా ఇష్టం అని అన్నారు. ఈ సమాజానికి కూడా ఏదో రోజు మార్పు వస్తుందని, కాకపోతే కొంచెం టైమ్ పడుతుందని వెల్లడించారు. ఇక తను ఎదుర్కొన్న వత్తిడులు, రాజకీయంగా తాను ఫేస్ చేస్తున్న సవాళ్లు, సమాజం పట్ల తన ఆలోచన తీరు ఏంటో ఈ వీడియోలో వివరించారు. జర్నలిస్టు తులసి చందు గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.