రామన్న యూత్ మూవీ టీమ్ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మంచి కామెడీ పాత్రలు చేసుకుంటున్న అభయ్ నవీన్ అసలు డైరెక్టర్ ఎందుకు అవాలనుకున్నాడో అనే దగ్గర నుంచి సినిమా పూర్తి అయ్యే వరకు జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Ramanna Youth Movie Team Exclusive Interview Abhay Naveen Anil Geela Amulya
Ramanna Youth: సినిమాలో(Movie) అవకాశాలు తగ్గిన తరువాత వేరేవాళ్లనెందుకు ఛాన్స్‌లు అడగాలి. మనమే సినిమా తీసి ఇతరులకు ఎందుకు అవకాశం ఇవ్వద్దు అనే ఆలోచన నుంచి తాను దర్శకత్వం(Director) వైపు వచ్చానని యాక్టర్, డైరెక్టర్ అభయ్ నవీన్(Abhay Naveen) తెలిపారు. ఇక ఏదైనా కొత్త పాయింట్‌తో ఎంటర్టైన్మెంట్ అందించాలని ఆలోచిస్తున్నప్పుడు ఫ్లెక్సీలా మీద స్టోరీ రాయలనే ఆలోచన వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక సినిమా రాయడం ఒకటి అయితే దాన్ని తీయలంటే డబ్బులు అనే చాలా పెద్ద సమస్య అన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ఫ్లెక్సీల చుట్టు సాగే కథనం చాలా ఆసక్తిగా ఉంటుందని, ఫ్లెక్సీ కట్టిన తరువాత జరిగే పరిణామాలే రామన్న యూత్(Ramanna Youth) అని చెప్పారు. ఇది కంప్లీట్ పొలిటకల్ సెటైర్ అని, దాన్ని కామెడీలో చెప్పామన్నారు. ఇక సినిమా క్లైమాక్స్ చాలా మందికి హర్ట్‌కు టచ్ అవుతుందని వెల్లడించారు. ఇక అనిల్ జీలా(Anil Geela) క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. డైరెక్షన్ చేయగలరన్న నమ్మకం ఎప్పుడు వచ్చిందో వివరించారు. త్వరలో విడుదల అవుతున్న ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే.