»Director Veera Shankar Exclusive Interview With Suresh Kondeti Pawankalyan Gudumbashankar
Veera Shankar: పవన్ కల్యాణ్ కాబోయే సీఎం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని వీర శంకర్ దర్శకత్వంలో వచ్చిన గుడుంబా శంకర్ చిత్రాన్ని 4కే లో రీరిలీజ్ చేశారు. అసలు ఆ సినిమా ఎలా మొదలైంది. అప్పటి సినిమా విశేషాలను, పవన్ కల్యాణ్ పర్సనల్ విషయాల గురించి అనేక విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో డైరెక్టర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Director Veera Shankar Exclusive Interview With Suresh Kondeti PawanKalyan GudumbaShankar
Veera Shankar: డైరెక్టర్ వీరశంకర్(Veera Shankar) ఆ సినిమాకు గుడుంబా శంకర్(GudumbaShankar) అని పేరు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటో వివరించారు. అప్పట్లో ఈ సినిమాను అన్నయ్య కోసం తమ్ముడు యాక్ట్ చేశారని కాని ఇప్పుడు తమ్ముడి కోసం అన్నయ్య సినిమాను రీరిలీజ్ చేస్తున్నాడని నాగబాబు(Nagababu)ను ఉద్దేశించి అన్నారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర వర్క్ చేయడం చాలా అదృష్టమన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాని తెలిపారు. హాలీవుడ్ సినిమాలను చూసి ఆయనెప్పుడు నేల విడిచి సాము చేయలేదని అందుకే ఆయన గొప్ప డైరెక్టర్గా ప్రజల మనుస్సులో గుర్తుండిపోతారు అని పేర్కొన్నారు. మళ్లీ పాత సినిమాలను విడుదల చేయడం మూలంగా చిన్న నిర్మాతలు చితకిపోతున్నారు అంటూ ఏం ఉండదు. అలా అయితే సమజవరగమన సినిమా 30కోట్ల షేర్ వసుళ్ చేసేది కాదన్నారు. పవన్ కల్యాన్ ఈ సినిమాలో ఫుల్ జోష్గా వర్క్ చేశారు. సినిమాకు స్క్రీన్ ప్లే, యాక్షన్ కొరియోగ్రఫి కూడా పవర్ స్టార్(Pawan Kalyan) చేశారని వెల్లడించారు. ఇక సినిమా సెట్లో పవన్ ఎంత సరదాగా ఉండేవారో లాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక పర్సనల్ అలాగే సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూను పూర్తిగా చూసేయండి.