Weekly Horoscope:ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రోజున మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న వార ఫలాలు చదవలరు.
మేష రాశి:పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో మసులుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. శుభకార్య పనులు విజయవంతం అవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృషభరాశి: కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రాజకీయ, ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. పనిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. దిగుబడి పెరుగుతుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం వస్తోంది. వ్యాపారులు చట్టపరమైన సమస్యలను అధిగమిస్తారు.
మిథున రాశి:ఉద్యోగులకు పనిలో భారం పెరుగుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా సరే చర్చకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు ఆలస్యం అవుతాయి. వారాంతంలో శుభవార్త వింటారు. నిలిచిపోయిన పనులను తిరగి ప్రారంభిస్తారు. ఖర్చుల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.
కర్కాటక రాశి: విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటుగా ఉండొద్దు.
సింహ రాశి: స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. వారాంతంలో ఖర్చులు పెరుగుతాయి. భూమికి సంబంధించి లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.
కన్య రాశి: విద్యార్థులకు అనుకూల సమయం. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాల వల్ల సమస్య ఏర్పడవచ్చు. వాహనం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. కోర్టు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఏకాగ్రతతో పనులు చేస్తారు. పెద్దల సలహాలను అమలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. నూతన ఒప్పందాలపై దృష్టిసారిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
తుల రాశి: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం ఉంటుంది. వారాంతంలో పని ఒత్తిడి పెరగవచ్చు. తప్పుదారి పట్టించే వ్యక్తులు ఉన్నారు. వ్యాపారంలో ఖర్చులు పెరగవచ్చు. భాగస్వాముల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
వృశ్చిక రాశి: ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి. న్యాయపరమైన సమస్యలు తీరే అవకాశం ఉంది. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనుల వల్ల డబ్బు, సమయం వృథా అవుతాయి. ఆచి తూచి నిర్ణయం తీసుకోవడం అవసరం. తలపెట్టిన పనులు తొలుత నత్తనడకన సాగినా, వారాంతంలో వేగం పుంజుకుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంటుంది. ఆదాయం పెరగడమే గాక.. ఆరోగ్యం మెరుగవుతుంది. కళాకారులకు అవకాశాలు వస్తాయి.
ధనుస్సు రాశి: అనుకున్న పనులు నలుగురి సహకారంతో పూర్తి అవుతాయి. పెద్దల సూచనలను పాటించడంతో సాఫల్యం ఉంటుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇచ్చిన బాకీ ఆలస్యంగా వసూలు అవుతాయి. ఇంటాబయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంటుంది. పైరవీలు ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు.
మకర రాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలంగా సమయం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. అధికారుల అండదండలు కూడా లభిస్తాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. బాకీలు వసూల్ అవుతాయి.
కుంభ రాశి: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. సంయమనం పాటించడం ఉత్తమం. సహోద్యోగులతో సఖ్యతతో మెలగండి. ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తప్పదు.
మీన రాశి: స్నేహితులు, బంధువులతో ఖర్చులు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసివస్తుంది. విదేశీ విద్య ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తోంది. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.