తిరుమల పుణ్యక్షేత్రంలో ఏరియల్ ఫుటేజీతో కూడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అదొక ఫేక్ వీడియో అని, తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని, శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని ఈవో తెలిపారు.
వైరల్ అవుతున్న వీడియో 3డీ ఇమేజీ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుంటుందని ఈవో ధర్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీటీడీపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోమని, ఫేక్ వీడియోలను ప్రచారం చేయొద్దని ఆయన సూచించారు.