Today Horoscope:ఈ రోజు రాశి ఫలాలు (ఆగస్ట్ 30, 2023)..స్త్రీలతో జాగ్రత్త!
ఈ రోజు శుభా అ శుభ గడియాలు ఏవి, ఏ సమయంలో మంచికార్యాలు తలపెట్టాలి. విద్య, వ్యాపారం, ఆర్థిక, క్రీడా, మానసిక పరమైన అంశాలు సహా అనేక విషయాలను నేటి రాశి ఫలాల్లో తెలుసుకోండి.
Today Horoscope: ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి
మేష రాశి వారు ఈరోజు విందులు, వినోదాలకు కాస్త దూరంగా ఉండటం శ్రేయస్కరం. ప్రశాంతత కోల్పోయి మానసిక ఆందోళనతో ఉంటారు. ఆకస్మిక ధననష్టం కలిగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో, పిల్లలతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులను పొందుతారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారు ఈ రోజు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ప్రయత్న కార్యాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారు చురుగ్గా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ రోజు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. అతి ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. కొత్తగా తలపెట్టే పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కోపంతో ఉంటారు. కఠిన మాటల వలన ఇబ్బందులకు గురవుతారు. శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇతరులకు హాని తలపెట్టే పనులకు దూరంగా ఉంటారు.
సింహ రాశి
సింహ రాశి వారు ఈ రోజు కుటుంబ విషయాలపై పెద్దగా ఆసక్తి చూపరు. ఇంటిలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య రాశి
ఈ రాశి వారి మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం ఉత్తమం. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. బంధు మిత్రులతో కలహాలకు అవకాశం ఉంటుంది. మనసుకు నచ్చని పనులు చేయకూడదు.
తుల రాశి
తుల రాశి వారికి ఈ రోజు మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అవసరం. ఆకస్మిక భయాలు దూరమౌతాయి. ప్రయాణాల్లో ఏమరపాటుగా ఉండకూడదు. ప్రయత్నకార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు కుటుంబంతో ఉన్న కలహాలు దూరం అవుతాయి. తద్వారా మానసిక ఆనందం పొందుతారు. చేయాల్సిన పనులు ఆలస్యం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు ఎడంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి.
మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనారోగ్యం బాధలు ఉంటాయి. తలచింది కాకుండా మరోకటి అవుతుంది. చికాగు కోపం ఎక్కువగా ఉంటుంది. సమయానికి భుజించడానికి ప్రయత్నిస్తారు. పిల్లలపట్ల ఏమాత్రం శ్రద్ధ వహించాలి. కొన్ని నిర్ణయాలు బాధిస్తాయి. మనోనిగ్రహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ రోజు ఆకాల కష్టాలు దూరం అవుతాయి. నూతన కార్యాలను మొదలు పెడుతారు. కుటుంబ ప్రోత్సాహం లభిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి కాలక్షేపం చేస్తారు. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను కొననుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత ఫలితాలను సాధిస్తారు. కొత్త పనులకు ప్రాధాన్యత ఇస్తారు. రుణభారం తీరుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు.