»The Brahmotsavams Of Srivari Salakatla Concluded With Grandeur In Tirumala
Tirumala: తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. శ్రీవారి ఆలయంలో నిర్వహించిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయని టీటీడీ ఛైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగాయి. మంగళవారం నిర్వహించిన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఉదయం పుష్కరణిలో శ్రీవారికి చక్రస్నానం చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి చక్రత్తాళ్వారుకు ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
శ్రీవారి పుష్కరిణిలో భక్తులను పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతించడంతో భక్తులు తరలివచ్చారు. పుష్కరిణిలో భక్తులు గోవింద నామస్మరణలతో మునిగితేలారు. అలాగే తిరువీధులన్నీ గోవింద నామస్మరణతో దద్దరిల్లాయి. మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో నిర్వహించిన ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి.