»Raksha Bandhan 2023 What Is The Best Time To Tie Rakhi To Your Brother Know The Auspicious Timings
Raksha Bandhan 2023: రాఖీ ఏ సమయానికి కట్టాలి?
అన్నదమ్ముల బంధానికి ప్రతీక రక్షా బంధన్ పండుగ. అయితే ఈ ఏడాది రాఖీ పండగ(Raksha Bandhan 2023) రెండు రోజులు వచ్చిన క్రమంలో అసలు ఏ సమయంలో తమ తోబుట్టువులకు రాఖీ కట్టాలని ఆలోచిస్తున్న క్రమంలో నిపుణులు ఉత్తమ సమయం ఇదేనని చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చుద్దాం.
Raksha Bandhan 2023 What is the best time to tie Rakhi to your brother Know the auspicious timings
రాఖీ పండగ(Raksha Bandhan 2023)కు ఎనలేని ప్రత్యేకత ఉంది. అన్నదమ్ముల శ్రేయస్సు కోరి తోబుట్టువులు జరుపుకునే అందమైన పండగ. మాములుగా అయితే, రాఖీ రోజున అమ్మాయిలు వారి సోదరుల చేతికి రాఖీ కట్టి, వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఆ రోజులో వారికి కుదిరిన టైమ్ లో రాఖీ కట్టేవారు. కానీ, ఈ సారి మాత్రం రాఖీ రెండు రోజులు వచ్చింది. దీంతో, ఏ రోజు జరపుకోవాలి. రాఖీ కట్టడానికి సుభ సమయం ఏది అనే గందరగోళం నెలకొంది. రక్షా బంధన్ ఆగస్టు 30నా లేక 31వ తేదీనా.. లేక రెండు రోజులూ జరుపుకోవచ్చా అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు.
అయితే ఈ ఏడాది భద్ర కాల, పౌర్ణమి తేదీలు కలిసి రావడంతో ఈ రెండు తేదీలతో గందరగోళం నెలకొంది. దృక్ పంచాంగ్ ప్రకారం, పూర్ణిమ తిథి ఆగస్టు 30 ఉదయం 10:58 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31న ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. ఇదిలా ఉండగా, రాఖీ సమయం సాయంత్రం 5:30 నుంచి 6:31 వరకు ఉంటుంది. భద్ర ముఖా సాయంత్రం 6:31 గంటలకు ప్రారంభమై రాత్రి 8:11 గంటలకు ముగుస్తుంది. రాత్రి 9:01 గంటలకు భద్ర కాలం(time) ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ కట్టడానికి ఉత్తమ సమయం రాత్రి 9:01 తర్వాత కానీ చాలామంది రక్షా బంధన్ రాత్రిపూట చేయకూడదు. కాబట్టి ఆగస్టు 31న ఉదయం రాఖీ కట్టుకోవచ్చని పలువురు చెబుతున్నారు.