Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 23rd)..స్త్రీల వలన ధనలాభం ఉంది.
ఈ రోజు(2024 April 23rd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశివారు మొదలు పెట్టిన పనుల్లో విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబం సౌఖ్యం ఉంది. ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.
వృషభం
ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు.
మిథునం
ఈ రాశివారు ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవలేక పోతారు. అనవసర వ్యయప్రయాసలకు పోతారు. వృథా ప్రయాణాలు చేస్తారు. స్త్రీల వలన ధనలాభం ఉంది.
కర్కాటకం
ఆకస్మిక ధనలాభం పొందుతారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని పొందుతారు. సన్నిహితులను కలుస్తారు. ఈ రాశివారు శుభవార్తలు వింటారు.
సింహం
స్థిరాస్తులకు సంబంధించిన గొడవలు అధిరమౌతాయి. కొత్త గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి.
కన్య
ఈ రాశివారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సమాజంలో మంచిపేరు లభిస్తుంది. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
తుల
ఈ రాశివారు ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా అవుతాయి. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం కొంత ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృశ్చికం
ఈ రాశివారు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. మీ పరాక్రమంతో విజయాలు సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా జరుగుతాయి. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనుస్సు
ఈ రాశివారు అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
మకరం
ఈ రాశివారు ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. చెడు పనులకు దూరంగా ఉండండి. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
కుంభం
కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి.
మీనం
తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు.