మేషం
అనుకున్న పని నెరవేరుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. అందరినీ కలుపుకు పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. శత్రుబాధలు ఉండవు.
వృషభం
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సాధిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది.మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహాసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు.
మిథునం
మిశ్రమ ఫలితాలు వస్తాయి.బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. నూతన పనులను ప్రారంభించడం మంచిదికాదు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం శ్రేయస్కరం. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది.
కర్కాటకం
కొత్త ఆలోచనలను కలిగిఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. కీలక వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది.
సింహం
మీరు చేసే రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.తలపెట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు.
కన్య
మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు.ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది.బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగు పడుతుంది రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
తుల
ఫ్యామిలీ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు.ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్తితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. బంధు, మిత్రులను కలుస్తారు.
వృశ్చికం
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది.సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
ధనుస్సు
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు.మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
మకరం
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.గొడవలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది
కుంభం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి విజయవంతంగా పనులను పూర్తిచేస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం
మనశ్శాంతి లభిస్తుంది.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. మీ పనితీరుకు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.