Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 30th)..తొందరపాటు మంచిది కాదు.
ఈ రోజు(2024 June 30th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
Horoscope Today: Today's horoscope (2024 July 1st).
మేషం
సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోలనతో ఉంటారు. ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. నూతన పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది.
వృషభం
ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదో వేసుకోవాలి. అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు ఉన్నయి.
మిథునం
వ్యవసాయరంగంలో మంచి లాభాలు ఉన్నాయి. తొందరపాటు మంచిది కాదు. దాని వలన కొన్ని పనులు చెడిపోతాయి.
కర్కాటకం
ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉన్నాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. రుణప్రయత్నం చేస్తారు.
సింహం
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొత్త వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. శుభవార్తలు వింటారు.
కన్య
శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. మొదలు పెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి.
తుల
ఆకస్మిక ధననష్టం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. పక్కదోవ పట్టించేవారి మాటలు అస్సలు వినరాదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి కరువౌతోంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా ఉండాలి.
ధనుస్సు
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ధనలాభాన్ని పొందుతారు. కొత్త వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
మకరం
కొత్త వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్తగా మెలగాలి. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా చూసుకోవాలి. తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మీనం
సమయానికి భోజనం చేయడానికి ప్రధాన్యత ఇస్తారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన శ్రమ అవసరం లేదు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా మంచిది.