ఇంద్రవెల్లి మండలం ధ్రువగూడా గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఇల్లు ఇటీవల ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు పటేల్ బుధవారం కాలిన ఇంటిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తక్షణ సాయం కింద రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధితులకు అన్నివిధానాల అండగా ఉంటూ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు.