కృష్ణా: బీబీగూడెం అండర్ పాస్ వద్ద ఈరోజు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా కారులో ఉన్న వ్యక్తి పోలీసులు గమనించి అనుమానాస్పదంగా ప్రవర్తించాడు. ఈ సందర్భంగా పోలీసులు కారుని తనిఖీ చేయగా రూ.5,60, 000 విలువైన 112 ప్యాకెట్లను గుర్తించారు. అనంతరం గంజాయిని స్వాదీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పమని పోలీసుల హెచ్చరించారు.