GDWL: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని ధరూర్ మండల పశువైద్యాధికారి వెంకటరాజు పేర్కొన్నారు. ఉప్పేరులో బుధవారం పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. 16 పశువులకు చూలు పరీక్షలు, 7 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స చేసినట్లు తెలిపారు. 17 దూడలకు నట్టల నివారణ మందు ఇచ్చామన్నారు.