హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. చలికాలం పొగమంచు, వాహనాల పొగ కారణంగా కాలుష్యం మూడంకెల సంఖ్యకు చేరింది. ముఖ్యంగా బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.