Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 14th)..శుభవార్తలు వింటారు.
ఈ రోజు(2024 June 14th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
ఒక పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. మొదలుపెట్టిన పనుల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు.
వృషభం
సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. అనవసర ఖర్చులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన ఉంటుంది. సన్నిహితులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మిథునం
కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సన్నిహితులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
కర్కాటకం
అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు లభిస్తాయి. కొత్త వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
సింహం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఇంటిపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రులతో వింధు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు.
కన్య
కుటుంబ పరిస్థితులు సంతోషకరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సమాజంలో మంచిపేరు పొందుతారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
తుల
కొత్త పనులు ఆలస్యంగా ప్రారంభిస్తారు. సమయానికి భోజనం చేయకపోవడం వలన అనారోగ్యాన్ని పొందుతారు. ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండాలి.
వృశ్చికం
మిక్కిలి ధైర్య, సాహసాలు ప్రదర్శిస్తారు. మంచి ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమానికి ఇతరులు గౌరవిస్తారు. శత్రుబాధలు ఉండవు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
ధనుస్సు
విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. స్థానచలనాలు ఉన్నాయి. అప్పు సులభంగా లభిస్తుంది.
మకరం
కుటుంబకలహాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉన్నాయి. అనవసర ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
కుంభం
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుసుకొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో ముందుకెళ్తారు.
మీనం
ప్రయత్నకార్యాలన్నీ నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాలు పంచుకుంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు మొదలు పెడతారు.