W.G: ఈ నెల 19 నుంచి 31 వరకు ఉండి నియోజకవర్గంలో ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆకివీడు పశుసం వర్ధక శాఖ AD డాక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. పశు బీమా పథకం గురించి పశువుల యజమానులకు అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరాలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.