Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 11th)..ఎదుటివారితో జాగ్రత్త
ఈ రోజు(2024 June 11th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
స్థానచలన సూచనలు ఉన్నాయి, ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాలి.
వృషభం
కోరుకునేది జరిగదు. సమయానికి భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధగా ఉండరాదు.
మిథునం
పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకుంటారు. మీమీ రంగాల్లో గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అనారోగ్య బాధలు ఉంటాయి. పిల్లలపట్ల జాగ్రత్త అవసరం.
కర్కాటకం
అన్ని పనుల్లో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఉన్నాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.
సింహం
తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఎదుటివారితో జాగ్రత్త.. మోసపోయే అవకాశాలు ఉంటాయి. నూతనకార్యాలు ప్రారంభించకూడదు.
కన్య
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం పాడౌతుంది. చిన్న విషయాల్లో ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం.
తుల
ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడే అవకాశాలున్నాయి. స్త్రీల మూలకంగా శత్రువులు తయారు అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
వృశ్చికం
ఇంటిలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ధనుస్సు
ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం ఉంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు.
మకరం
కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు.
కుంభం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనారోగ్య బాధలుంటాయి. మీమీగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది.
మీనం
అనవసరమైన భయాందోళనలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం అందుతుంది.