మేషం
మీ కార్యాలయంలో అందరితో మంచి ప్రవర్తనను కొనసాగించండి. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి..కొంతమంది మీకు హాని కలిగించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృషభం
నూతన పరిచయాలు పెరుగుతాయి.మీరు మొదలు పెట్టిన నూతన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి.రాజకీయ వ్యక్తులకు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదురుకావచ్చు.ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.
మిథునం
స్వల్పంగా ధన లాభం ఉంటుంది.మీరు స్నేహితులతో కలసి వ్యాపారం ప్రారంభించవచ్చు.అనుకోని ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
కర్కాటకం
ఈ రాశివారి వైవాహిక జీవితంలో ఒత్తిడి దూరమవుతుంది.ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
సింహం
మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని సాధించాలనే తపన ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు.
కన్య
మీ మీ ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు.ఎక్కువ డబ్బు ఖర్చుచేయవద్దు. అనుకున్న పనుల్లో జాప్యం జరగవచ్చు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.వ్యాపారంలో నూతన పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడమే మంచిది.
తుల
ఉద్యోగులు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి కొనుగోలు, అమ్మకం నుంచి ప్రయోజనం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో మీ కార్యాచరణ పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు.
వృశ్చికం
మీరు మీ పరిచయాల ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థిక విషయాలలో ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనుస్స
మీ కుటుంబపరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు.ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుంటేనే పూర్తవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో కొంత అసమతుల్యత ఉండవచ్చు.స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
మకరం
మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండొచ్చు. మారుతున్న వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. మీ ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
కుంభం
ఈ రోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అవసరమైన సమయంలో మీ సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది.విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వైవాహిక సంబంధాలలో ఉన్న వివాదాలు సమసిపోతాయి.గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది.
మీనం
పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందుతారు.ప్రేమ వివాహానికి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఈరోజు మంచిది. కుటుంబంలో శుభకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు.వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.