మేషం
మీరు అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నూతనకార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
వృషభం
విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.మేధోపరమైన పని నుంచి ఆదాయం ఉండొచ్చు. ప్రేమ సంబందాలకు సంబంధించి మనసులో మాట చెప్పేందుకు ఇదే శుభ సమయం. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మలన్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.మీ సహజ స్వభావం అందరికీ నచ్చుతుంది.
మిథునం
ఈ రోజంతా మీరు ఉల్లాసంగా ఉంటారు..కానీ కొన్ని విషయాల్లో స్వీయ నియంత్రణ పాటించాలి. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
కర్కాటకం
మీరు అనవసర గొడవలకు దూరంగా ఉండాటం మంచిది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసర పరుగులు తీయొద్దు. సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
సింహం
విద్యార్థులకు చదువులో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రయాణం చేసే అవసరం రావొచ్చు. ఆదాయం తగ్గుతుంది. కొత్త ప్రేమను వెతుక్కోవద్దు..ఉన్న ప్రేమను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
కన్య
మీరు తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు.బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రేమ, బంధానికి సంబంధించిన విషయాల్లో మీ మాట కన్నా మీ చర్యలు ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.
తుల
ఈ రోజు ఈ రాశివారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యా , పరిశోధన పనుల కోసం వేరే ప్రదేశానికి వెళ్ళవచ్చు. ఎక్కువ శ్రమ ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. కళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు.
వృశ్చికం
మీరు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ప్రేమ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వండి.
ధనుస్సు
మీరు అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.
మకరం
ఈ రాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఉల్లాసభరితమైన స్వభావం అందర్నీ ఆకర్షిస్తుంది. ఎవ్వరినీ ఎగతాళి చేయొద్దు, ప్రలోభ పెట్టొద్దు.
కుంభం
మీరు ప్రశాంతంగా ఉంటారు.ఇంకా ఓపిక పట్టేందుకు ప్రయత్నించండి. అదనపు ఖర్చులు ఉంటాయి. మతపరమైన సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది.
మీనం
మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు ప్రయత్నించాలి, ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి రావొచ్చు. ఈ రోజు మీరు మీకు అత్యంత సన్నిహితుల నుంచి అసమ్మతిని ఎదుర్కొనే అవకాశం ఉంది.ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు.