»Horoscope Today Todays Horoscope November 16th 2023 Will Hear Good News
Horoscope Today : నేటి రాశిఫలాలు(November 16th 2023)..శుభవార్తలు వింటారు
ఈ రోజు(November 16th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
మేషం:
అనుకున్నవన్నీ ముందుకు సాగుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాల్లో వేగాన్ని పెంచుతారు. కార్యకలాపాల్లో ఒత్తిడి ఎదురవుతుంది. ఉద్యోగులకు ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో చికాకులు తొలగుతాయి.
వృషభం:
మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందులకు ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు జరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. డబ్బుల సాయం అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం:
అన్ని రకాలుగా పరిస్థితులు బావుంటాయి. ఏది తలపెట్టిన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఏర్పడుతుంది. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బావుంటుంది.
కర్కాటకం:
అన్ని రంగాల్లో మీ మాటకు విలు పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో పోటీని తట్టుకుని నిలబడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
సింహం:
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బును రాబట్టుకుంటారు. బాకీలను వసూలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఊహించిన దానికంటే లాభాలు మరింత పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.
కన్య:
అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు పెంచుకోకండి. వ్యాపారాల్లో నష్టాలను చవిచూస్తారు. వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట ఒత్తిడి పెరిగినా ఎదుర్కొంటారు. కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల:
ధనలాభం చేకూరుతుంది. మొండి బాకీలను వసూలు చేస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బావుంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుంటే మంచిది.
వృశ్చికం:
వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి అవసరానికి సాయం అందుతుంది. కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. స్థిరాస్తి అమ్మకాలు చేపడుతారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు.
ధనుస్సు:
అన్ని రంగాల వారికి ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగాల్లో మీ మాటలకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇతరులకు సాయం చేస్తారు. ఒత్తిడి ఉన్నా ఎదుర్కొంటారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మకరం:
అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు, సమస్యలు పరిష్కరిస్తారు. వ్యక్తిగత సమస్యలు తీరుతాయి. రెండు శుభవార్తలు వింటారు. పని ఒత్తిడి బాధపెడుతుంది. కొత్తవారు పరిచయం అవుతారు. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.
కుంభం:
ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. పొరపాట్లు రాకుండా చూసుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మీనం:
వ్యక్తిగత సమస్యలు తీరుతాయి. మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగంలో సామరస్యం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతారు. జీతాలు పెరిగే అవకాశం ఉంది. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.