»Horoscope Today Todays Horoscope 2024 January 24th
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 24th).. గోసేవ చేయండి
ఈ రోజు(2024 January 24th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మంచి ఆలోచనతో కార్యాలు మొదలుపెడుతారు. కొత్త కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది.
వృషభం
మీరు చేపట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని మీరు అధిగమించుతారు. కొందరి వలన బాధ పడుతారు. కుటుంబంలో కలహాలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకోవాలి, గోసేవ చేస్తే అంతా మంచే జరుగుతుంది.
మిథునం
మీ చేస్తున్న వృత్తిలో ఆశించిన ఫలితాలుంటాయి. చుట్టు ఉన్నవారి వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.
కర్కాటకం
పని భారం పెరుగుతుంది. మీ పై అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మంచిది.
సింహం
కీలక వ్యవహారాలలో పెద్దలను సమ్మతి ఉంటుంది. సన్నిహితులు మీకు అనుకూలంగా మెలుగుతారు. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చు పెరుగుతుంది. బంధువులతో వాదనలకు దిగొద్దు. ఇష్టదైవాన్ని పూజించండి.
కన్య
సన్నిహితుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్టదైవారాదన శుభం.
తుల
పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. భాద్యతలు పెరుగుతాయి. కొన్ని విషయాల్లో అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం చదడవం శుభం.
వృశ్చికం
శ్రమ పెరుగుతుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శ్రీరామరక్షా స్తోత్రం చదివితే మంచిది.
ధనస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణం చేయడం మంచిది.
మకరం
ఆలోచించి అడుగేస్తే ఫలితం మీదే. ప్రియమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచిది.
కుంభం
పనిభారం పెరుగుతుంది. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే మాటలు వినాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
మీనం
అనుకున్న పనులు పూర్తి అవుతాయి. సౌఖ్యం ఉంటుంది. పై అధికారుల సహకారం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.