»Horoscope Today Todays Horoscope 2024 February 5th
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 February 5th).. ఎవరినీ అతిగా నమ్మరాదు!
ఈ రోజు(2024 February 5th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఈ రాశి వారికి ఇది మంచి సమయం. కొన్ని విషయాల్లో నిర్భయంగా చెబితే ఇబ్బందులు దరి చేరవు. ఉన్నతమైన ఆలోచనలు చేసి వాటిని సాధించే వరకు విశ్రమించవద్దు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
వృషభం
మీ రంగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంది. ఒక ముఖ్యమైన విషయంలో సహకారం అందుతుంది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శివనామం స్మరించాలి.
మిథునం
మీ మీ రంగాలలో సమయానుకులంగా ప్రవర్తించి ఓ కీలక సమస్యను పరిష్కారం చేస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉన్నాయి. శివపార్వతుల దర్శనం మంచిది.
కర్కాటకం
పనిలో ఏకాగ్రతగా ఉండడం మంచిది. కీలక నిర్ణయాలు తీసుకోబోయే ముందు పెద్దల సలహాలు తీసుకోవాలి. ఫలితం మిశ్రమంగా ఉంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేస్తే అంతా మంచే జరుగుతుంది.
సింహం
ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలితే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టబోయే ముందు తగిన సలహాదారులను సంప్రదించడం మంచింది. ఆర్థికపరంగా కలిసొస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షే నమః అనే నామాన్ని జపించండి అంతా శుభం కలుగుతుంది.
కన్య
మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో, బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ధన లాభం ఉంది. వినాయక దర్శనం మంచిది.
తుల
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధించడానికి శ్రమ అధికమవుతుంది. ఎవరినీ అతిగా నమ్మరాదు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. సూర్య నమస్కారం చేస్తే శుభం కలుగుతుంది.
వృశ్చికం
మీ మీ రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే పట్టుదల ఉండాలి. అవసరానికి తగిన ధనం సమయానికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈశ్వర ధ్యానం మంచిది.
ధనస్సు
పట్టుదలతో చేస్తే విజయం మీదే. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. లలితా దేవి నామస్మరణ చేయండి అంతా మంచే జరుగుతుంది.
మకరం
మీ సంకల్పబలమే మిమ్మల్ని విజయానికి తీసుకెళ్తుంది. మీ ప్రతిభే మీకు ఆయుధం. ఆర్థికంగా కలిసోస్తుంది. దైవానుగ్రహం ఉంది. గురు ధ్యాన శ్లోకం చదవడం మంచిది.
కుంభం
మీ మీ రంగాల్లో అందర్నీ కలుపుకొని పోవడం మంచిది. మీ నమ్మకంతోనే మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఖర్చు అదుపు చేయాలి. శని శ్లోకం చదువితే మంచిది.
మీనం
మీరు తీసుకునే నిర్ణయంపైనే భవిశ్యత్తు ఉంది. మీ మీ రంగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గా ధ్యానం శుభం కలుగజేస్తుంది.