»Horoscope Today Todays Horoscope 2024 February 3rd
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 February 3rd).. దైవబలం తోడుంటుంది.
ఈ రోజు(2024 February 3rd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ప్రారంభించిన కార్యక్రమాలలో విజయం లభిస్తుంది. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయం అందుతుంది. దైవబలం తోడుంటుంది. శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోండి.
వృషభం
దైవచింతనతో పనులు చేయండి అనుకున్నది సాధిస్తారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండడం మంచిది. ఇష్టదేవతా స్తోత్రం చదవండి శుభం కలుగుతుంది.
మిథునం
మీమీ రంగాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఒక విషయం మీకు బాధ కలిగిస్తుంది. ఆలోచించి ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గా దేవిని స్తుతించండి.
కర్కాటకం
కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. అనవసరంగా ఆలోచించి కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. మనోధైర్యంగా ఉండేలా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడుతాయి. శివారాధన మంచిది.
సింహం
అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే పట్టు వదలకుండా పనిచేయాలి. అనవసరమైన విషయాలలో తల దూర్చడం మంచిది కాదు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవండి.
కన్య
ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. మీమీ రంగాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే విజయం మీదే. దుర్గాస్తుతి చేయండి.
తుల
పనికి తగ్గ ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. సూర్యస్తుతి చేయండి.
వృశ్చికం
మొదలుపెట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మీ కీర్తిప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. స్నేహితుల, బంధువుల సహాకారం ఉంటుంది. శ్రీఆంజనేయ ఆరాధన మంచిది.
ధనస్సు
అనుకున్న పనులు జరుగుతాయి. స్నేహపూర్వక వాతావరణాన్ని పాడుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో అన్ని విషయాలు చర్చించండి. శ్రీఆంజనేయ సందర్శనం చాలా మంచిది.
మకరం
మంచి నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తాయి. సమర్థవంతంగా పనిచేయండి. కీలక విషయాల్లో సన్నిహితుల సలహా తీసుకోండి. శ్రీవేంకటేశ్వరుని సందర్శనం మంచిది.
కుంభం
సమయానికి తగ్గట్టు ఆలోచించండి. మీ పట్టుదలే విజయానికి చేరువ చేస్తుంది. అనవసర విషయాల్లో కలుగజేసుకోకండి. శ్రీలక్ష్మీధ్యానం మంచిది.
మీనం
ఎప్పటి పనులు అప్పుడే చేయండి. చాలా విషయాల్లో తెలివిగా ఉండండి, కాస్త ఏమరిపాటు తనం మీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు కదలండి. గణపతి ఆరాధన చేయండి అంతా మంచే జరుగుతుంది.