Horoscope today: నేటి రాశి ఫలాలు(September 3rd 2023 )..ఖర్చులు పెరుగుతాయి
నేడు (september 3rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు సహా అనేక జ్యోతిష్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈరోజు మీ మనస్సు చంచలంగా ఉంటుంది. గజకేసరి, సర్వార్థసిద్ధి యోగం ఏర్పడడం వల్ల వ్యాపారానికి సమయం అనుకూలం. వ్యాపారంలో ఎక్కువ లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. మీ భాగస్వాములతో మీ సంబంధాలు కూడా బలపడతాయి. మీరు మీ ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు. కార్యాలయంలో ఏదైనా సాంకేతిక పనిలో మీ నైపుణ్యాన్ని నిరూపించుకోగలరు. నిరుద్యోగులకు ఈ రోజు చాలా బాగుంటుంది. వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
వృషభ రాశి
నేడు మీకు ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుది. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాల విషయంలో మొండిగా ఉండకండి. గ్రహణ దోషం ఏర్పడటం వలన, కార్యాలయంలో మీ పని ప్రత్యర్థుల కారణంగా ఆలస్యం కావచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ పొందుతారు.
మిథున రాశి
మీరు మీ విధులను గుర్తించి నెరవేర్చగలుగుతారు. వ్యాపారంలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. కాలానుగుణంగా పరిస్థితులు మారుతాయి. కాబట్టి మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం తప్పనిసరి. కార్యాలయంలో కొంత పని కారణంగా, మీ గౌరవం పెరగవచ్చు. మీరు ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయం పొందుతారు. మీ పనిలో మునుపటి కంటే మెరుగ్గా చేయగలుగుతారు. దీంతోపాటు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశి
మీరు మీ ఉద్యోగంలో కొత్తగా ఏదైనా చేయగలరు. వైద్య వ్యాపారంలో ప్రతికూలతలు పెరుగుతాయి. కొన్ని ఖర్చులు పెరగడం వల్ల మీ ఆందోళన కూడా పెరుగుతుంది. మిగిలిన రోజులు మీకు బాగానే ఉంటాయి. మీ పనిలో పూర్తిగా బిజీగా ఉంటారు. వ్యాపారస్తులు ఈరోజు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు కార్యాలయంలో కొన్ని అవాంఛనీయ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
సింహ రాశి
మీరు మంచి పనులు చేయడం ద్వారా అదృష్టం మీవైపు ఉంటుంది. కొత్త ఆలోచనలు మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి. ఇది కాకుండా, మార్కెట్ నుంచి రుణం తీసుకోవడం కూడా మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో మీ ఆలోచనలు గొప్పగా ప్రశంసించబడతాయి. ఈ రోజు కార్యాలయంలో మీకు సహకారం, మద్దతు ఉంటుంది.
కన్య రాశి
ఈరోజు క్లిష్టమైన విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. భాగస్వామ్య వ్యాపారంలో డబ్బు నిర్వహణ విషయంలో కొంత నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతి ఒక్క పైసా చాలా విలువైనది. కాబట్టి దానిని తెలివిగా ఖర్చు చేయండి. గ్రహణ దోషం ఏర్పడటం వల్ల నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. కానీ మీ ప్రయత్నాన్ని విడవొద్దు, కష్టపడి పని చేయండి.
తులరాశి
నేడు వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. గజకేసరి, సర్వార్థసిద్ధి యోగం ఏర్పడటంతో వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని పొందుతారు. మీరు కార్యాలయంలో ఆశించిన విజయం సాధిస్తే మీ ఆనందానికి అవధులు ఉండవు. మీ సమస్యలు కొన్ని ఈ రోజుతో ముగియవచ్చు. మీరు కొన్ని శుభవార్తలను కూడా వింటారు.
వృశ్చిక రాశి
ఈరోజు మీరు మీ శత్రువుల నుంచి ఉపశమనం పొందుతారు. మీ నెట్వర్క్ని విస్తరించడం ద్వారా కొత్త వ్యాపార శాఖను ప్రారంభించాలనే ఆలోచన మీకు వస్తుంది. దానిని ఫలవంతం చేయడానికి ఈరోజు మధ్యాహ్నంలోపు ప్రయత్నించండి. కార్యాలయంలోని సీనియర్లు, ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందుతారు.
ధనుస్సు రాశి
ఈరోజు మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సర్వార్థసిద్ధి యోగం ఏర్పడడం వల్ల వ్యాపార ఒప్పందం కుదురుతుంది. దీంతోపాటు మీ సమస్యలు తగ్గుతాయి. ఈ రోజున మీరు కొత్త ఆదాయాన్ని కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు పెద్ద కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లభిస్తుంది. ఉద్యోగస్తులు లాభపడవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండండి. గ్రహణ దోషం ఏర్పడటం వలన, వ్యాపార భేటీలో ఆలస్యం కారణంగా మీరు పెద్ద అవకాశాన్ని కోల్పోవచ్చు. వ్యాపారంలో మిమ్మల్ని మీరు మరింత ముఖ్యమైనదిగా పరిగణించుకోవాలి. ఉద్యోగంలో మీ అవసరాలపై శ్రద్ధ పెట్టడం మర్చిపోవద్దు. కార్యాలయంలో మీ పని సమయానికి పూర్తి కాకపోవడం వల్ల మీ సమస్యలు పెరుగుతాయి.
కుంభ రాశి
నేడు మీ చెల్లెలు చేసే పనులను గమనించండి. మీరు వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలను పొందుతారు. మీరు వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అలాగే మీరు ఏదైనా కొత్త పనిని చేయాలనుకుంటున్నట్లయితే మధ్యాహ్నం లోపు పూర్తి చేయండి. మీరు కార్యాలయంలో కొన్ని పనులు చేయడం వల్ల బాస్ నుంచి ప్రశంసలను పొందుతారు.
మీన రాశి
ఈరోజు మీకు మంచి పుణ్య కార్యాలు ఎదరయ్యే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారంలో వస్తున్న సమస్యలను కష్టపడి ఎదుర్కొండి. మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. వ్యాపార భాగస్వాములతో మీ అవగాహన బాగానే ఉంటుంది. మీ కార్యాలయంలో మీరు టీమ్‌వర్క్ ద్వారా మీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారు. కుటుంబంలో విభేదాలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు.