»Horoscope Today In Telugu September 2nd 2023 Telugu
Horoscope today: నేటి రాశి ఫలాలు(September 2nd 2023)..దైవబలం సిద్ధిస్తోంది
నేడు(02 September 2023 ) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు సహా అనేక జ్యోతిష్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మేషరాశి వారికి ఈ రోజు ఏదైనా కార్యం తలపెట్టేప్పుడు తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. మీరు చేస్తున్న రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తల దూర్చడం మంచిది కాదు. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి వీలు ఉంటుంది. ఈ రోజు శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడం చాలా మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు ఉదయం నుంచే శుభ ఘడియలు మొదలయ్యాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలలో పాలు పంచుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. దుర్గాదేవి దర్శనం మీకు అన్ని విధాల మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు ఫలితాలు కొంత ఆలస్యంగా అందుతాయి. ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగడం మంచిది. ఈ రోజు మీ వ్యక్తివిషయాల్లో మంచి జరుగుతుంది. నూతన వస్తువులను కోనుగోలు చేస్తారు. వృథా ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. హనుమత్ ఆరాధన శుభకరం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ రోజు చేపట్టే పనుల్లో మనోబలంతో, పూర్తి విశ్వాసంతో చేయడం ప్రధానం. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది. విపరీతమైన ఆలోచనలు తగ్గించి కాలానుగుణంగా సాగిపోవాలి.
సింహ రాశి
సింహ రాశి వారు ఈరోజు అనుకున్న పనులకు పూర్తి ఫలితాలు అందుబాటులో లేవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానుకోవద్దు.
కన్య రాశి
కన్యరాశి వారికి ఈ రోజు చేసిన కార్యలకు మంచి ఫలితాలు లభిస్తాయి. తోటి వారికి సాయం చేయండి. అందుకు తగిన ఫలితాన్ని భవిష్యత్తులో పొందుతారు. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం చాలా మంచిది.
తుల రాశి
తులరాశి వారు ఈ రోజు చాలా దృఢంగా ఉంటారు. మీరు ఉన్న రంగాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. అందరి సలహాలు అడగడం అంత మంచిది కాదు. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. శ్రీవిష్ణు సందర్శనం ఆయన్ను పారాయాణం చేయడం ఉత్తమం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. సంతోషాన్ని పొందుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు ఈ రోజు కీలక వ్యవహారాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మనోబలం కోల్పోకూడదు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే అంతా మంచే జరుగుతుంది.
మకర రాశి
మకరరాశి వారికి ఈ రోజు దైవబలం సిద్ధిస్తోంది. ధర్మ చింతనతో నడుచుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం.
కుంభ రాశి
కుంభరాశి వారు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో మంచి ప్రశంసలు పొందుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో ధైర్యంతో ముందుకు సాాగడం మరిచిపోవద్దు. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయం వైపు నడిపిస్తాయి. గోవింద నామాలు చదివితే అంతా మంచే జరుగుతుంది.
మీన రాశి
మీనరాశి వారికి ఈ రోజు తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి ప్రశంసలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన శుభకరం.