Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 17th).. ప్రయత్నాలు ఫలిస్తాయి!
ఈ రోజు(2024 January 17th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మీ ప్రయత్నం మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. శత్రువులను తక్కువ అంచన వేయొద్దు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనుల పట్ల నిర్లక్ష్యం మంచిది కాదు. మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహించండి. శ్రీవిష్ణువుని ఆరాధించాలి.
వృషభం
ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. మనోబలంతో కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ మంచిది.
మిథనం
ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఒక శుభవార్త వింటారు. మీ పై అధికారులు పనితీరును మెచ్చుకుంటారు. బంధువులు సహకరిస్తారు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
కర్కాటకం
ముఖ్యమైన సమస్యకు సమాధానం దొరుకుతుంది. స్నేహితులు, బంధువులు ఆర్థికసాయం చేస్తారు. కీలక వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీధ్యానం ఉత్సాహాన్ని ఇస్తుంది.
సింహాం
మీరు ఎంచుకున్న రంగాలలో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. పనిభారం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళిక చేసుకుంటే కొన్ని సమస్యలు తప్పుతాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కన్య
ఏ నిర్ణయం తీసుకున్న బంధుమిత్రులను సంప్రదించడం మంచిది. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు వస్తాయి. శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ ధ్యానశ్లోకాలు చదవండి.
తుల
ప్రారంభించిన పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక కీలక నిర్ణయం మిమ్మల్ని అభివృద్దిలోకి తీసుకొస్తుంది. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం
మనోబలంతో చేసే పనులు మంచి ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. చేపట్టే పనిలో నష్టం కలుగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని ప్లాన్ చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి. చంద్రధ్యానం మంచిది.
ధనస్సు
ప్రారంభించబోయే కార్యాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు పూర్తవుతాయి. చంచలబుద్ధివల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గురు ఆరాధన శుభప్రదం.
మకరం
అనుకున్నది నేరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైనవారితో సమయాన్ని గడుపుతారు. ఇష్టదైవాన్ని పూజించడం మంచిది.
కుంభం
మిశ్రమ ఫలితాలు పొందుతారు. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం అంత మంచిది కాదు. సూర్యనమస్కారం చేయండి.
మీనం
గ్రహబలం అనుకూలిస్తోంది. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.