»Durga Mata Mandapam With Panipuris Devotees Are Coming In Queue At The Shrine
Video viral: పానీపూరీలతో దుర్గామాత మండపం..నోరూరించే మందిరం వద్దకు క్యూకడుతున్న భక్తులు!
నవరాత్రి సందర్భంగా దుర్గామాతను వివిధ రూపాల్లో అలంకరించి భక్తులు పూజిస్తూ ఉంటారు. అయితే కోల్కతాలో మాత్రం వెరైటీగా తమ భక్తిని చాటుకుంటుంటారు. తాజాగా అక్కడ పానీపూరీలతో దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ మండపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశవ్యాప్తంగా నవరాత్రి సంబరాలు మొదలయ్యాయి. దసరా వచ్చిందంటే చాలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. దేశంలోని వివిధ అమ్మవారి దేవాలయాలను సందర్శించి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చాలా మంది తమ ప్రాంతంలోనే అమ్మవారి మండపాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కలకత్తా ప్రాంతంలో కాళి అంటే చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. ఇక్కడ భక్తులు వెరైటీగా తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ప్రత్యేక అలంకరణలతో దుర్గమ్మ మందిరాలను ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
వైరల్ అవుతోన్న పానీపూరీల దుర్గామాత మండపం వీడియో:
Kolkata's Durga Puja pandals: where phuchka (panipuri) meets divine architecture, a truly heavenly combination! 🙌🏛️ pic.twitter.com/Ytz6a0Aafy
కోల్కతా (Kolkata)లోని కళాకారులు దుర్గమ్మను వివిధ రూపాల్లో రూపొందించి పూజించడం అలవాటు. హైదరాబాద్ (Hyderabad)లో గణేషుడిని వినూత్నంగా పలు రూపాల్లో చేయించినట్లుగానే కోల్కతాలో దుర్గామాతలు వివిధ రూపాల్లో కనువిందు చేయడం విశేషం. తాజాగా కోల్కతా నగరంలోని దక్షిణ శివారు బెహలాలో వెరైటీగా దుర్గా మండపాన్ని రూపొందించారు.
దుర్గామాతా మందిరాన్ని చూసేందుకు వచ్చిన వారందరికీ నోరూరిపోతోంది. ఎందుకంటే ఆ మండపాన్ని పానీపూరీలతో అలంకరించడం విశేషం. అక్కడి దుర్గమ్మ మందిరంలో ఎటు చూసినా పానీపూరీలే కనిపిస్తాయి. అందుకే ఆ మండపం అందంతో పాటుగా రుచిలోనూ పోటీపడుతోంది. ఈ మందిరానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పానీపూరీల మందిరాన్ని బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసింది. మండపం వీడియోను వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా పోస్ట్ చేయడంతో అది నిజంగా డిఫరెంట్గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మండపాన్ని గోల్ గప్ప మందిరం అని పిలుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.