Crime News : తమ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని 16 ఏళ్ల బాలుడిని కొందరు యువకులు చంపేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షాహ్ బాద్ డెయిరీ ఏరియాలో చోటు చేసుకుంది. వాళ్లు 16 ఏళ్ల బాలుడికి రూ.18 వేలు ఇచ్చారు. చాలా రోజులు అయినా ఆ బాలుడు వాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ఆ యువకులు అదును చూసి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం తెలిసింది. దీంతో ఆ బాలుడిని హత్య చేసిన నలుగురు యువకులు హర్షిత్, విక్రమ్, విపిన్, పంకజ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.18 వేల కోసం బాలుడిని పొట్టన పెట్టుకున్నారా అని స్థానికులు ఆ యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.