»Viral News Husband Absconded After Wife Molested Him In Kerala
Viral news: భార్య వేధింపులు భర్త పరార్.!
భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి ఓ భర్త పారిపోయాడు. రెండు సంవత్సరాల తరువాత అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో అతని ఆచూకీ దొరికింది. ఆ క్రమంలో జరిగిన పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Viral news: Husband absconded after wife molested him in Kerala
Viral news: భర్త టార్చర్(Husband torturer), అత్త వేధింపులు(Aunt harassment) పడలేక పారిపోయిన మహిళల కేసులు చాలానే చూసింటాము. కానీ కేరళ(Kerala)లోని ఓ ప్రాంతంలో భార్య పెట్టే వేధింపులు భరించలేక ఓ భర్త ఇంట్లోనుంచి పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని పథనంతిట్ట జిల్లాలోని కలంజూర్ గ్రామంలో అఫ్సానా, నౌషాద్ భార్య భర్తలు కాపురం ఉండేవారు. ప్రతి రోజు అఫ్సానా భర్త నౌషాద్ను కొట్టి వేధించేది. ఆ బాధ తట్టుకోలేక 2021లో నౌషద్ ఇంట్లో నుంచి పారిపోయాడు. కొన్నాళ్లకు తన కుమారుడు కనిపించడం లేదని, తన కోడలు మీద అనుమానం ఉన్నట్లు నౌషద్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏడాదిన్నరగా పోలీసులు వెతుకూతునే ఉన్నారు. ఆచూకీ మాత్రం లభించలేదు.
కేసు విచారణలో భాగంగా భార్య అఫ్సానాను పోలీసులు పలు మార్లు అడిగి చూశారు. విసిగి పోయిన ఆమె ఒక సమయంలో నౌషాద్ను తానే చంపి ఖననం చేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు నౌషద్ మృతదేహాం కోసం గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. అఫ్సానా కావాలనే తమను తప్పుదోవ పట్టిస్తోందని పోలీసులకు అనుమానం వచ్చింది. మరోవైపు అతడి ఆచూకీ కోసం తమ ప్రయత్నాలు కొనసాగించారు. ఈ క్రమంలో నౌషద్ను గుర్తించి విచారించగా అసలు విషయం బయటపడింది. తన భార్య, ఇంకొంత మంది కలిసి తనపై తరచూ దాడి చేస్తుండటంతోనే భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు. పోలీసులను తప్పుదోవ పట్టించిన అఫ్సానాను అరెస్టు చేశారు. తన మానసిక పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.