ఇఫ్లూలో దారుణం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. ఆమె ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విద్యార్థిని ఆత్మహత్యపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఆరోపణలు మరో రకంగా ఉన్నాయి.
లేడీస్ హాస్టల్ లో సరైన రక్షణ చర్యలు లేవని, గ్రిల్స్ లేకపోవడం వల్ల కింద పని చనిపోయిందని విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు. వర్సిటీలో విపరీతంగా డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని, డిసెంబర్ 31న ఇద్దరు బెంగాలీ యువతులు కర్నాటకు చెందిన అమ్మాయిపై దాడి చేయడంతో పాటు లేడీస్ హాస్టల్ లో నానా హంగామా సృష్టించారని అంటున్నారు. విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.