»School Principal Brutalized 45 Women Take Videos Too
Pakistan: 45 మంది మహిళలపై స్కూల్ ప్రిన్సిపాల్ దారుణం..వీడియోలు తీసి మరీ!
ఓ స్కూల్ ప్రిన్సిపాల్ 45 మంది మహిళా టీచర్లను అత్యాచారం చేసిన ఘటన పాక్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు.
పాక్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ (Pakistan)లోని కరాచీలో ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ ఉద్యోగాల పేరుతో మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. టీచర్లను బెదిరించి వారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. విషయం వెలుగులోకి రావడంతో ప్రిన్సిపాల్ ఇర్ఫాన్ గఫూర్ మెమన్ (Irfan Gafoor meman)ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తన వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ (CC Footage)ని చూపించి మహిళా టీచర్లను ప్రిన్సిపాల్ బెదిరించేవాడు. ఆయన ఫోన్ నుంచి 25 షార్ట్ వీడియోలను (Videos), సీసీటీవీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళా టీచర్‌తో ప్రిన్సిపాల్ గఫూర్ ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ (Video Viral) అవ్వడంతో కీచక ప్రిన్సిపాల్ బాగోతం బయటపడింది.
ఈ కేసులో ప్రిన్సిపాల్ గఫూర్ (Principal Gafoor)కు కోర్టు ఏడు రోజుల పాటు రిమాండ్ విధించింది. ఉద్యోగం ఆశ చూపి మహిళా టీచర్లపై గఫూర్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని, టీచర్లతో సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపించి బెదిరించే వాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే దీనిపై మరింత విచారణకు పాక్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. గఫూర్ చేతిలో తాము లైంగిక వేధింపులకు గురైనట్లు ఇప్పటికే ఐదుగురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.