»Huge Fire Accident In Godown Property Worth Lakhs Burnt At Assam Kamrup Metro District
Huge fire accident: గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..లక్షల విలువైన ఆస్తి దగ్ధం
ఓ ప్లాస్టిక్ గౌడౌన్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
అసోంలోని కమరూప్ మెట్రో జిల్లా(Assam Kamrup Metro district)లోని జోరాబత్ ప్రాంతానికి సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన ఆస్తులు కాలిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. భారీ అగ్ని ప్రమాదం(fire accident) సంభవించడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.
#WATCH | Assam: A massive fire broke out at a plastic carton godown near the Jorabat area in Assam's Kamrup-Metro district. Fire tenders are present at the sport. Further details are awaited. pic.twitter.com/NDI4YqAVZT