»Notices To Bollywood Celebrities In Mahadev Betting App Case
Bollywood: ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్లో అలజడి రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting App) కేసు కలకలం రేపుతోంది. ఈ కేసు బాలీవుడ్ (Bollywood) సెలబ్రిటీల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఇందులో ఉన్నారని పోలీసులు తెలిపారు. తాజాగా మరికొంత మంది సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించారు. ఈ బెట్టింగ్ యాప్ కేసులో స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)కు నోటీసులు అందాయి. ఇప్పుడు తాజాగా మరికొందరికి అధికారులు నోటీసులిచ్చారు. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (kapil sharma), నటి హుమా ఖురేషి, హీనా ఖాన్, శ్రద్ధా కపూర్ (shradda Kapoor) పేర్లు నోటీసులు ఇచ్చిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈనెల 4న రణబీర్ కపూర్‌కు ఈడీ (ED) అధికారులు సమన్లు ఇచ్చారు. తాజాగా కపిల్ శర్మ, హుమా ఖురేషీ, శ్రద్ధా కపూర్, హీనా ఖాన్లకు కూడా ఈడీ అధికారులు సమన్లు పంపారు. సన్నీలియోన్, కృష్ణ అభిషేక్, పుల్కిత్ సమ్రాట్ సహా మరో 14 మంది సెలబ్రిటీలు ఈడీ రాడార్‌లో ఉన్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుడు సౌరభ్ చంద్రకర్ వివాహానికి సైతం నోటీసులిచ్చిన వారందరూ హాజరయ్యారు.
ఈ కేసులో హీరో రణబీర్ కపూర్‌ను అక్టోబర్ 6వ తేదిన విచారణకు హాజరు కావాలని ఈడీ (ED) అధికారులు సమన్లు ఇచ్చారు. రాయ్‌పూర్ బ్రాంచ్‌లో రణబీర్‌ను హాజరు కావాలని అధికారులు తెలిపారు. అయితే రణబీర్ మాత్రం తనకు రెండు వారాల సమయం కావాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో కపిల్ శర్మ, హుమా ఖురేషి, శ్రద్దా కపూర్, హీనా ఖాన్ పేర్లు బయటకు రావడంతో బాలీవుడ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈడీ అధికారులు నోటీసులిచ్చిన వారిలో విశాల్ దద్లానీ, టైగర్ ష్రాఫ్, నేహా కక్కర్, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి ఖర్బందా, నుస్రత్ భరుచా వంటివారు ఉన్నారు. దుబాయ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్ వివాహానికి పాక్ గాయకులు అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీఖాన్ వంటివారు కూడా హాజరయ్యారు. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. హవాలా ద్వారానే సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చినట్లుగా సౌరభ్ పై ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా రూ.5000 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో మరికొంత మంది పేర్లు కూడా బయటికి వస్తాయని వెల్లడించింది.