»Sahil Khan Troubles Increase In Mahadev Betting App Case Actor Will Remain In Police Custody Till May
Mahadev Betting App : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. సాహిల్ ఖాన్ కు మే 7వరకు కస్టడీ
నటుడు సాహిల్ ఖాన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. సాహిల్ ఖాన్ కు కోర్టు నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదు. విచారణ సందర్భంగా మే 7 వరకు పోలీసు కస్టడీని కోర్టు పొడిగించింది.
Mahadev Betting App : నటుడు సాహిల్ ఖాన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. సాహిల్ ఖాన్ కు కోర్టు నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదు. విచారణ సందర్భంగా మే 7 వరకు పోలీసు కస్టడీని కోర్టు పొడిగించింది. 15000 కోట్ల విలువైన మహదేవ్ బ్యాటింగ్ యాప్ కేసులో ముంబై పోలీసుల సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నటుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ సందర్భంగా.. ప్రభుత్వ న్యాయవాది తన వాదనను తెలియజేస్తూ సాహిల్ ఖాన్ ఎండార్స్మెంట్ కాదని జూదం ఆడే యాప్‌కు యజమాని అని అన్నారు.
‘ది లయన్ బుక్’ యాప్ యజమాని సాహిల్ ఖాన్ అని అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అతడు దుబాయ్ కూడా వెళ్లేవాడు. విచారణ సమయంలో సాహిల్ ఖాన్ దుబాయ్‌లో ఎవరిని కలిసేవాడు. దుబాయ్‌కు వెళ్లడానికి ఎవరు డబ్బు చెల్లించారు. ఎంత మందిని తన యాప్‌లో చేర్చుకున్నాడు అనే విషయాలను దర్యాప్తు అధికారులు తెలుసుకోవాలనుకుంటున్నారు. విచారణలో సాహిల్ ఖాన్ ఏమాత్రం సహకరించడం లేదని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. ఈ విషయాలన్నింటిపై విచారణ జరిపేందుకు క్రైమ్ బ్రాంచ్ అధికారులు పోలీసు కస్టడీని డిమాండ్ చేశారు. సాహిల్ ఖాన్ తరపు న్యాయవాది వాదిస్తూ.. సాహిల్ ఖాన్ సెలబ్రిటీ అని, అతను ప్రమోట్ చేస్తాడని స్పష్టంగా చెప్పాడు.
కోర్టు ముందు వాదిస్తున్నప్పుడు, సాహిల్ తరపు న్యాయవాది అతను ఈ యాప్‌లను కాంట్రాక్ట్ ద్వారా ప్రమోట్ చేస్తాడని.. ఇది ఒక రకమైన ఎండార్స్మెంట్ అని, మరేమీ లేదని అన్నారు. సాహిల్ ఖాన్ డబ్బు లావాదేవీలు జరిపినట్లు ఇప్పటి వరకు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. సాహిల్ ఖాన్ గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాడని రుజువు చేసే కాల్ వివరాలు కూడా వారి వద్ద లేవు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాహిల్ ఖాన్‌ను మే 7 వరకు పోలీసు కస్టడీకి పంపింది.