»Former Mlas Son Sahil Is In Dubai The Policeman Who Helped Was Suspended
Praja Bhavan Accident: దుబాయ్ పారిపోయిన మాజీ ఎమ్మెల్యే తనయుడు.. హెల్ప్ చేసిన పోలీసుపై వేటు
ప్రజాభవన్ బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో నింధుతుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్‌కి పారిపోయినట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Former MLA's son Sahil is in Dubai. The policeman who helped was suspended
Praja Bhavan Accident: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్(Sahil) వేగంగా కారు నడిపి ప్రజాభవన్(Praja Bhavan) ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి(Accident)న విషయం తెలిసిందే. తాజాగా సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ కేసునుంచి తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోయినట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో సాహిల్‌కు సాయపడిన ఎస్హెచ్ఓను సస్పెండ్ చేశారు. ఈ నెల 23 తేదీ అర్థరాత్రి అతివేగంతో ఈ ప్రమాదం జరిగింది. మరుసటి రోజు అంటే ఆదివారం తెల్లవారు జామున నలుగురు వ్యక్తులు పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మంతనాలు జరిపినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. ఈ కేసునుంచి అతన్ని తప్పించడానికి సుమారు రూ. 20 నుంచి రూ.25 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్‌ను ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, ఆ తర్వాత అక్కడి నుంచి దుబాయ్ పరారైనట్టు తెలుస్తుంది. అతన్ని ఎయిరపోర్ట్‌లో గుర్తించిన పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. దుబాయ్ నుంచి రప్పించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిందితున్ని తప్పించేందుకు ప్రయత్నం చేసిన పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు.