»Firing In Prague University Czech Republic 14 Dead
Prague: యూనివర్సిటీలో కాల్పులు..14 మంది మృతి
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లోని విశ్వవిద్యాలయంలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో 14 మంది మరణించారు. దీంతోపాటు డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
firing in Prague university Czech Republic 14 dead
చెక్ రిపబ్లిక్(Czech Republic) రాజధాని ప్రేగ్లోని ఒక విశ్వవిద్యాలయంలో గురువారం ఓ విద్యార్థి ఆకస్మాత్తుగా కాల్పులు జరుపగా..14 మంది మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. చెక్ రిపబ్లిక్లో జరిగిన ఈ ఘోరమైన కాల్పుల్లో 20 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. చార్లెస్ యూనివర్శిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్ భవనంలో ఈ రక్తపాతం జరిగిందన్నారు. అక్కడ షూటర్ విద్యార్థి అని ప్రేగ్ పోలీస్ చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ తెలిపారు. కాల్పులు(firing) జరిపిన వ్యక్తి కూడా మరణించాడని అధికారులు చెబుతున్నారు. కానీ అతని పేరు బయటపెట్టలేదు. 14 మంది మరణించారని, మరో 25 మంది గాయపడ్డారని అధికారి ముందుగా చెప్పగా.. తర్వాత 15 మంది మరణించారని, 24 మంది గాయపడ్డారని సాయంత్రం వొండ్రాసెక్ చెప్పారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
జన్ పలాచ్ స్క్వేర్‌లోని వల్తావా నదికి సమీపంలో ఉన్న భవనంలో కాల్పులు జరిపిన బాధితుల గురించి లేదా కాల్పులకు గల కారణాల గురించి పోలీసులు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. చెక్ ఇంటీరియర్ మినిస్టర్ విట్ రకుసన్ మాట్లాడుతూ, పరిశోధకులు ఏదైనా తీవ్రవాద భావజాలం లేదా సమూహాలతో లింక్‌ను అనుమానించడం లేదని అన్నారు. ప్రాగ్‌కు పశ్చిమాన ఉన్న తన స్వస్థలమైన హోస్టూన్లో ముష్కరుడు తన తండ్రిని గురువారం ముందుగా చంపాడని.. అతను తనను తాను చంపుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారని వోండ్రాసెక్ చెప్పారు. షూటర్ క్రిమినల్ రికార్డ్ లేని అద్భుతమైన విద్యార్థి(student)గా అభివర్ణించారు, కానీ ఇతర సమాచారం అందించలేదు.