కరీంనగర్ (Karimnagar) పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో దారుణం జరిగింది. మరో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. 12 రోజుల్లో.. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ చనిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్ (Hyderabad) కు చెందిన యుగంధర్ 2023 మే 22నుంచి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (Police Training Centre) లో శిక్షణ తీసుకుంటున్నాడు. 2023 జూన్ 06 మంగళవారం రోజున బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్లిన సమయంలో యుగంధర్ (Yugandhar) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.. అక్కడ చికిత్స పొందుతూ యుగంధర్ కన్నుమూశాడు, అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన తర్వాతే యుగంధర్ చనిపోయినట్లుగా పోలీసులు (Police) చెబుతున్నారు. యుగంధర్ మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2023 మే 25న కూడా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో హైదరాబాద్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రానాసింగ్ (Ranasingh) అనే వ్యక్తి శిక్షణ తీసుకుంటూ మృతిచెందాడు. ఈ ఘటన అనంతరం సరిగ్గా 12 రోజులకి మరో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో చర్చణీయాంశంగా మారింది. దీంతో అక్కడ ట్రైనింగ్ తీసుకుంటోన్న ఇతర అభ్యర్థులు అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు.