7 members bodies fished out from bhima river in pune
మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న భీమా నది తీరంలో విషాదం చోటు చేసుకుంది. భీమా నది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. భీమా నది తీరంలో మృతదేహాలు ఉన్నాయనే సమాచారం అందండంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. నది తీరంలో నాలుగు మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఆ తర్వాత కొంత సేపటికి మరో మూడు మృతదేహాలు కనిపించాయి. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అందులో ఇద్దరు వృద్ధులు, వృద్ధుల కూతురు, అల్లుడు, ముగ్గురు మనవళ్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఒకే ఫ్యామిలీకి చెందిన ఏడుగురు వ్యక్తులు ఒకే చోట చనిపోయినట్టు కనిపించడం పోలీసులకు అనుమానస్పదంగా అనిపించింది. వీళ్లు ఆత్మహత్య చేసుకున్నారా? లేక వీళ్లను ఎవరైనా చంపి అక్కడ పడేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూణెకు దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో భీమా నది ఉంది. భీమా నది దాటడానికి పార్గావ్ అనే వంతెన ఉంది. ఆ వంతెన దగ్గరే వీళ్ల మృతదేహాలు దొరికాయి. వీళ్ల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు అని పోలీసులు స్పష్టం చేశారు.
Maharashtra | Bodies of 7 members of a family fished out from Bhima river in Daund, Pune – 4 bodies recovered b/w 18-21 Jan & 3 others found today. Prima facie it's a suicide, however, police are investigating from all angles. Accidental Death Report registered: Pune Rural Police pic.twitter.com/XGkGguV6zV