BDK: అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురంలో శనిగరపు పుల్లయ్య మృతదేహం పొలం వద్ద మంగళవారం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికితే ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో మృతదేహం లభ్యమవడంతో విద్యుత్‌షాక్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRML: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తలపెట్టిన ఛలో సెక్రటేరియట్‌కు భైంసా ఆర్టీసీ ఉద్యోగులు తరలివెళ్లారు. రెండు ప్రత్యేక వాహనాల్లో ఉద్యోగులు HYDకి పయనమయ్యారు. 2021సంవత్సరం ఉద్యోగుల పే స్కేల్‌ను శాశ్వతంగా 30 శాతం అమలుపరచి, మా లక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలన్నారు.
NGKL: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోనే తాడూరు మండలంలో 18.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. కల్వకుర్తి మండలంలో 11.3, అమ్రాబాద్ లో 7.0, పదరలో 4.3, అయినోల్ లో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
NZB: వేల్పూర్ మండలం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుమారి రూప ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ఆడి మంచి ప్రతిభ కనపరిచినందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య గణేశ్, ఉపాధ్యాయులు మంచే గణేశ్, మహేందర్ ఉన్నారు.
NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు, గోధుమల్లో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నిరుపేదల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘాను ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,081 రేషన్ దుకాణాలపై నిరంతరం పరిరక్షణ ఉంచాలని ఆ శాఖ నిర్ణయించుకుంది.
KMR: బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో జనసేన పార్టీ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు సరిత మానేకర్ హాజరై మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభం కాబోతున్నాయని, బిచ్కుంద మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలను తీసుకోవాలని పేర్కొన్నారు.
WGL: ప్రతిష్ఠాత్మక కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల కాలంలో విద్యార్థుల మధ్య గొడవలు, ఘర్షణలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రశాంత వాతావరణం ఉండే క్యాంపస్‌లో ఇప్పుడు అస్థిరత నెలకొంది. నిన్న యూనివర్సిటీలోనే చికెన్ కోసం విద్యార్థులు కర్రలతో కొట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పర్యవేక్షణ లేక గొడవలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 17వ వార్డ్‌లో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య పనులను కమిషనర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. మురుగు కాలువలలో పేరుకుపోయిన చెత్తను సిబ్బందిచే తీయించారు. వార్డ్‌లలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
MDK: విద్యుత్ సమస్యలు పరిష్కారంలో భాగంగా మనోహరాబాద్ మండలం రామయిపల్లిలో ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కాళ్లకల్ ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రజాబాటలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
SRD: సిర్గాపూర్ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థుల అంతర్గత పరీక్షల మార్కులను GHM వెంకటేశం బృందం నేడు పరిశీలించారు. నిర్మాణాత్మక మూల్యాంకన 4 పరీక్షలకు సంబంధించి మార్కులు, ప్రాజెక్ట్, ప్రయోగ పని, చేతిరాత ఒక్కొక్క అంశానికి 5 చొప్పున 20 మార్కులకు ఆధారాలను చూస్తూ, పరిశీలకులు చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. మొత్తం 103 మంది విద్యార్థుల వివరాలు పరిశీలించారు.
MHBD: వాహనదారులు ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్లను తప్పకుండా ధరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. దాతల సహాయంతో పలువురు వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అరైవ్-అలైన్’ అమలు చేస్తుందన్నారు.
ADB: నార్నూర్ మండలం కొత్తపల్లి మాల్కుగూడలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కనక భీంరావ్‌కు చెందిన గోధుమ, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. సాయంత్రం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల వల్ల పంట పొలం నాశనమైందని రైతు తెలిపారు. ఈ సంఘటన రైతుకు తీరని నష్టాన్ని కలిగించింది.
PDPL: మంథనిలో నేటి నుంచి మూడు రోజుల పాటు 24,25,26 తేదీలలో మహా సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహా రావు ప్రవచనములకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మంథనిలోని మణికంఠ కళా ప్రాంగణం అయ్యప్ప దేవాలయంలో నిర్వహించుటకు నిర్ణయించకున్నారు. ఈ కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వహకులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పరిరక్షణలో, పరీక్షల నిర్వహణ జరుగుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.
BHNG: రాజాపేట మండలం బేగంపేటకి చెందిన శతాధిక వృద్ధురాలు ఫ్రీడమ్ ఫైటర్ వలిమెల లక్ష్మి (106) సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె భర్త హన్మంత్ స్వాతంత్ర సమర యోధుడు. జైలు జీవితం కూడా గడిపారు. 106 సంవత్సరాలకు పైగా జీవించిన లక్ష్మి రజాకార్లతో పోరాటం, బాధలు, బాధ్యతలు, మనుమరాండ్లతో సుఖదుఃఖాలు, మనుమలు, పరిపూర్ణ జీవనం గడిపారని గ్రామస్తులు సంతాపం తెలిపారు.