WGL: నగరంలోని మున్నూరు కాపు భవన్ ప్రక్కన పాలిటెక్నిక్ భవన నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రూ. 22 కోట్లతో నిధులు కేటాయించి నూతన భవనాలు ఏర్పాటు సంతోషంగా ఉండని ఆయన అన్నారు.
RR: కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో 25- 27వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామస్తులు ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి MLC రూ. 50 వేలు అందజేశారు.దేవాలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
HNK: నగరంలోని గిరిజన భవన్‌లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ చిత్రపటం వద్ద MLA కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు.
ASF: వాంకిడి మండలం బనార్కోసారలో కుటుంబ సభ్యులు మందలించారనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI మహేందర్ వివరాల ప్రకారం.. నాగేషే రవీందర్ మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా తిరుగుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన అతను ఇంట్లో చీరతో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
NRPT: ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఎలాంటి తప్పులకు తావులేకుండా పరీక్షలు జరగాలని ఆమె ఆదేశించారు. మొదటి సంవత్సరం 4408 మంది, రెండో సంవత్సరం 3783 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
NGKL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలం వట్టెం, రామిరెడ్డిపల్లిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ తాగునీటి ఇంటింటి సర్వేను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
KMM: రైతులు తమ పత్తిని కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు ఇవాళ సూచించారు. జిల్లాలో 2025-26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి.
SRCL: బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో శనివారం ఏడబ్ల్యూసీలో నూతనంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక నిర్వహించారు. కమిటీ ఛైర్మన్‌గా సర్పంచ్ సంధ్య, ఉపసర్పంచ్ మారుతి, వీవో సంధ్య, లావణ్యలచే కమిటీ ఏర్పాటు చేశామని అంగన్వాడి సూపర్వైజర్ నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, అనూజ, తల్లులు, గర్భవతులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.
HNK: పరకాల మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని మసీదు వద్ద స్ట్రీట్ లైట్లు, కొత్త డ్రైనేజ్ పనులను శనివారం సాయంత్రం నూతన కౌన్సిలర్ పడిదెల దీప్తి-రాకేష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా రోడ్లు, లైట్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
MDK: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు చర్యలపై తెలుసుకున్నారు.
MDK: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు చర్యలపై తెలుసుకున్నారు.
GDWL: కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. దీంతో ఇవాళ జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రోటోకాల్, భద్రతలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలని ఆదేశించారు. హెలిపాడ్ నుంచి ఆలయం వరకు ఉన్న రహదారులను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన హెచ్చరించారు.
NZB: ప్రతీ సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, దీనిని సమస్యలు ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు తమకు సమస్యలను పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించి వాటిని పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
KNR: వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడ జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో KNR, HUZ ఆర్డీవోలు, సమావేశమయ్యారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 23న చెస్ మెన్ సౌత్ జోన్ ఎంపికలు, ఆలిండియా తైక్వాండో మెన్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ డా. వై. శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన చెస్ క్రీడాకారులు మార్చి 1-5 వరకు తిరుచిరాపల్లి సౌత్ జోన్ పోటీల్లో, తైక్వాండో క్రీడాకారులు మార్చి 2-6 వరకు జలంధర్‌లో జరిగే ఆలిండియా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.