KMM: మధిర మండలంలోని జాలిముడి మల్లారం వద్ద మధిర డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు ఆపమని సంకేతాలు ఇచ్చినా ఆగకపోవడం స్థానికుల్లో ఆవేదన కలిగిస్తుందని స్థానికులు శుక్రవారం తెలిపారు. వయసు మళ్లిన వృద్ధులు బస్సు ఎక్కేందుకు చేతులు ఊపుతూ ఆపమని సూచించినప్పటికీ, బస్సు కొంత దూరం వెళ్లిపోయిందని అక్కడి ప్రజలు తెలిపారు.
JN: పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రానున్నారు. నూతన ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళా నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కోరారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, విభాగాల్లోని ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలని GM ఎం.శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్లడ్ గ్రూపు వంటి వివరాలు గనులు, విభాగాలపై సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. లేకపోతే వీరికి మెడికల్ రిఫరెన్స్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
PDPL: రామగుండం మున్సిపల్ పరిధిలోని 45వ డివిజన్లో పారిశుధ్యంపై తగు చర్యలు తీసుకోవాలని 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయనను సంబంధిత డివిజన్ పరిశుద్ధ కార్మికులు మున్సిపల్ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఆయన సన్మానించి డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు.
NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ నెల 19 నుంచి 23 వరకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన ప్రతిభా కనబరిచిన క్రీడాకారులు ఎంపిక చేసి పంపడం జరిగింది. ఈ జట్టుకు కోచ్‌గా శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ పాఠశాలలో PET గా నిర్వహిస్తున్నారు.
HYD: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. కొంపల్లి సమీపంలోని ఓ భవన నిర్మాణ స్థలంలో ఐదో అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. భవన నిర్మాణ పనుల కోసం తల్లితో కలిసి వచ్చిన బాలిక, బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
PDPL: శ్రీ తిరుమల తిరుపతి స్వామి వారిని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
MHBD: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారురాలు తుప్పతూరి అనసూర్య ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఇవాళ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇళ్లు లేని నిరుపేదల పాలిట గొప్ప వరమని అన్నారు.
ADB: సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ (TGCET-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉట్నూర్ లాల్ టెక్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ హరిరామ్ తెలిపారు. ఈ నెల 22న (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లతో పాటు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలన్నారు.
KMM: అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమించడం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోకబత్తిని అనిత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.
BDK: మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 22 న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ASF: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 15 వరకు పొడిగించాలని వాంకిడి మండల రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ కవితకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 20తో గడువు ముగియనుండటంతో సమయాన్ని పెంచి అందరికీ న్యాయం చేయాలని కోరారు. మండలంలోని రైతులు పత్తి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎలిగేడులోని ఆయన నివాసంలో ఇటీవల ఎన్నికైన రామగుండం మున్సిపల్ పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగరం మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ ఎల్లయ్య ఎమ్మెల్యేని కలిసి నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
SDPT: కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని MP రఘునందన్ రావు స్పష్టం చేశారు. అక్బర్‌పేట్ భూంపల్లి మండలం బొప్పాపూర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలతో పాటు వివిధ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
BDK: చుంచుపల్లి మండలం NK నగర్ బాదావత్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలోని సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్వరంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇందిరా, ఉప సర్పంచ్ మాలోత్ లక్ష్మి పాల్గొన్నారు.