• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మాట నిలబెట్టుకున్న మాజీ మేయర్

KNR: కరీంనగర్‌లో ఎన్నికల హామీని నెరవేర్చిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన మాడిశెట్టి రవీందర్ కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.25,000 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హామీని అమలు చేశామన్నారు.

February 21, 2026 / 08:17 AM IST

అధికారులు సమన్వయంతో కృషి చేయాలని: కలెక్టర్

SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.

February 21, 2026 / 08:14 AM IST

ఆందోళన కలిగిస్తున్న మరణాలు..!

NLG: జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మామిడాలలో అప్పుల బాధతో సంతోష్ ఉరివేసుకోగా, తిట్టకుంటలో మానసిక స్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేష్ గడ్డిమందు తాగి మృతి చెందాడు.

February 21, 2026 / 08:14 AM IST

మత సామరస్యం.. మసీదుకు ఆర్థిక సాయం

RR: నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో కాంగ్రెస్ నాయకుడు మాణిక్యం మత సామరస్యాన్ని చాటుకున్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని మసీదు అభివృద్ధి కోసం ఆయన రూ. 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. సర్పంచ్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని మైనార్టీ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ, భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 21, 2026 / 08:11 AM IST

భక్తి మార్గంలో పయనించాలి: మున్సిపల్ ఛైర్మన్

ADB: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ నూతన ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 21, 2026 / 08:11 AM IST

కబడ్డీ జట్టుకు కోచ్‌గా పండు రాథోడ్

NZB: మక్తల్‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు కోచ్‌గా పండు రాథోడ్ నియమితులయ్యారు. పండు రాథోడ్ ప్రస్తుతం కాకతీయ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా జట్టు రాణించేలా ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పండు రాథోడ్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించినారు.

February 21, 2026 / 08:10 AM IST

ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కట్కామ్ మల్లేశం సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే రూ. 5016ల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామంలో ఇద్దరు ఆడపిల్లల పెళ్లిలకు రూ. 5016ల చొప్పున ఆర్థిక సహాయాన్ని శుక్రవారం రాత్రి అందజేశారు.

February 21, 2026 / 08:07 AM IST

‘రెండేళ్లుగా నిరాశ.. ఈసారైనా సాధించాలి’

VKB: గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో వికాబాదాబ్ జిల్లా రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. గతేడాది 73.97 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు.

February 21, 2026 / 08:06 AM IST

వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ PHCలను ఏర్పాటు

MNCL: లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఆసుపత్రి వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిశీలించారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ PHCలను ఏర్పాటు చేసిందన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి ప్రజల సంక్షేమం కొరకు చర్యలు తీసుకుంటుందన్నారు.

February 21, 2026 / 08:06 AM IST

‘నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్’

NRML: జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. వెంటనే వసూలు చేసేందుకు సోమవారం నుంచి నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పన్నులు చెల్లించని వారికి నోటీసులు అందించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

February 21, 2026 / 08:04 AM IST

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు నేటికి 13 ఏళ్లు

HYD: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 21, 2026 / 08:04 AM IST

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

BDK: అక్రమ సంబంధం బయటపడిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాచలంలో కలకలం రేపింది. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకకు చెందిన రమేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, మైలవరానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భద్రాచలంలో నివసిస్తున్నాడు. దీంతో ఇంట్లో ఈ విషయం తెలిసిందని ఆత్మహత్య చేసుకున్నడు.

February 21, 2026 / 08:01 AM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

SDPT: జిల్లా కలెక్టర్ కె.హైమావతి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశలు, నిలిచిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంజూరైన ఇల్లు గ్రౌండింగ్ కావాలని, ఎంపీడీఓలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు.

February 21, 2026 / 08:01 AM IST

మంత్రి నేటి పర్యటన వివరాలు

NRPT: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ఇవాళ పట్టణంలో పర్యటించనున్నారని మున్సిపల్ కమిషనర్ మురళి ఒక ప్రకటనలో తెలియజేశారు. మక్తల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఉదయం 11 గంటలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

February 21, 2026 / 08:01 AM IST

14 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

నల్గొండ ఐదవ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్గొండ, జనగాం, సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రాత్రి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 07:54 AM IST